29, మార్చి 2016, మంగళవారం

మాకియవెల్లి-ద ప్రిన్స్: 19 వ అధ్యాయం






రాజు - రాజ్యం




అధ్యాయం -19

తిరస్కారానికి, ద్వేషానికి గురికాకుండా ఒక రాజు జాగ్రత్తవహించాలి







(Unedited)


పైన తెలిపిన లక్షణాలలో ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు నేను చెప్పాను. ఇక మీదట మిగతా వాటి గురించి ఈ సాధారణ నియమం క్రింద సంగ్రహంగా చర్చించాలనుకుంటున్నాను: ఇంతకుముందే చెప్పినట్లుగా ఒక రాజు తను ద్వేషానికి, తిరస్కారానికి గురికాగల అంశాలనుండి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. ఈ విషయంలో జాగ్రత్త వహించినంతవరకు అతడు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించినవాడవుతాడు. అప్పుడు అతను చేసే మిగతా తప్పులవల్ల ఏ ప్రమాదమూ వాటిల్లదు. (మిగతా తప్పులు చేసినప్పటికీ ప్రమాదం గురించి భయపడవలసిన అవసరం మాత్రం లేదు) (అప్పుడిక ఇతర తప్పులు చేసినా కూడా )

నేను ముందే చెప్పినట్లుగా ఒక రాజు మిగతా విధాలుగా కన్నా దోపిడీదారుడుగా తయారు అవటాం వలన, అలానే తన ప్రజల ఆస్తుల విషయంలోనూ, స్త్రీల విషయంలోనూ జోక్యం చేసుకోవటం వలన చాలా త్వరగా ద్వేషానికి గురీవుతాడు. అందువలన అతడు వీటికి దూరంగా ఉండాలి. తమ ఆస్తులకుగానీ, గౌరవానికిగానీ హాని జరగకుండా ఉన్నంతకాలం ప్రజలలో అధిక సంఖ్యాకులు సంతృప్తికరంగా జీవిస్తారు. మరి అప్పుడు రాజు —అనేక విధాలుగానూ, అలాగే సులభంగానూ హద్దులలో ఉంచగలిగిన— కొద్ది మంది ఆకాంక్షలతోటే పోరాడవలసి ఉంటుంది. 

ఒక రాజు చంచలుడుగా, ఆషామాషీ వ్యక్తిగా, భోగలాలసుడుగా, పిరికివాడుగా, త్వరగా ఒక నిర్ణయానికి రాలేని వ్యక్తిగా కనిపించినపుడు అతడు తిరస్కారానికి గురవుతాడు. కనుక ఈ లోపాలేవీ తనలో లేకుండా చూచుకోవడంలో అతడు అత్యంత జాగరూకుడై ఉండాలి, తన చేతలన్నింటిలో గొప్పదనం, ధైర్యం, గంభీరత, బలం కనబడేటట్లుగా అతడు బాగా (మిక్కిలి) యత్నించాలి. తన అనుచరుల వ్యక్తిగత వ్యవహారాలలో అతడి నిర్ణయం (తన అనుచరులతో వ్యక్తిగతంగా వ్యవహరించేటపుడు) అతడి తీర్పు తిరుగులేనిదిగా (మార్చలేనిదిగా) ఉండాలి. ఏ ఒక్కరూ కూడా అతడిని అధిగమించడానికిగానీ, మోసగించడానికిగానీ సాహసించలేనివిధంగా  అతడు తన ప్రఖ్యాతిని నిర్మించుకోవాలి.

తన గురించి అటువంటి అభిప్రాయం కలిగించగలిగే రాజు (ఉన్నతమైన ప్రఖ్యాతి) ఉన్నతంగా గౌరవింపబడతాడు. ఎవరైతే ఉన్నతంగా గౌరవింపబడతారో వారికి వ్యతిరేకంగా కుట్రచేయడం అంత సులువు కాదు. (ఉన్నతంగా గౌరవింపబడే వానిమీద కుట్ర చేయడం అంత తేలిక కాదు) ఎందుకంటే ఇతడు చాలా మంచి రాజు, తన ప్రజల చేత బాగా (మిక్కిలి) గౌరవింపబడతాడు అనే విషయం అందరికీ బాగా తెలిసినట్లైతే అతడి మీద దాడి చేయడం అంత సులువు కాదు. (అతడు చాలా కష్టం ద్వారా మాత్రమే దాడి చేయబడతాడు) (అతడి మీద దాడి చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది) ఈ కారణంగా ఒక రాజు రెండు విధాలుగా భయపడవలసి ఉంటుంది. ఒకటి దేశం లోపలినుండి—తన అనుచరులవలన. మరొకటి దేశం వెలుపలనుండి— విదేశీ శక్తులవలన. మంచి సైన్యాన్ని, ఆయుధాలను (సాయుధసైన్యాన్ని), మంచి పొత్తులను కలిగి ఉండటం ద్వారా రెండవ భయాన్నుండి రక్షన పొందుతాడు. మంచి సాయుధసైన్యం ఉన్నట్లైతే అతడికి మంచి మిత్రులుకూడా లభిస్తారు. కుట్ర ద్వారా ముందే అలజడి తలయెత్తకపోయినట్లైతే దేశం వెలుపలవ్యవహారాలు ప్రశాంతంగా ఉన్నపుడు దేశం లోపలి వ్యవహారాలు కూడా ఎల్లపుడూ ప్రశాంతంగానే ఉంటాయి. ఒక వేళ (విదేశీ దండయాత్ర) దేశం వెలుపల ఏదైనా అలజడి కలిగినప్పటికీ నేను చెప్పిన విధంగా అతడు సిద్ధంగా ఉండి, ఆ ప్రకారంగానే జీవించి, ధైర్యంగా పోరాడిన పక్షంలో —నేను చెప్పిన స్పార్టన్ రాజు నబిస్ వలే— అతడు ప్రతి దాడిని కాచుకుంటాడు.

దేశం బయటి వ్యవహారాలు ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఇతడు తన అనుచరులకు సంబందించి వారు రహస్య కుట్రకు పాల్పడతారేమో అని  భయపడవలసి ఉంటుంది. తాను ద్వేషానికి, తిరస్కారానికి లోను గాకుండా ఉండటంద్వారానూ, ప్రజలు తన ఎడల సంతృప్తులై ఉండేటట్లు చేయడం ద్వారానూ ఇతడు అటువంటి భయాన్నుండి సులువుగా తనను రక్షించుకోగలుగుతాడు. (పైన నేను వివరంగా చెప్పినట్లు ఈ విధంగా జాగ్రత్త పడటం (దీనిని నిర్వర్తించడం) ఒక రాజుకు అత్యవసరం) ప్రజల ద్వేషానికి, తిరస్కారానికి గురికాకుండా ఉండటం అనేది ఒక రాజు కుట్రలకు వ్యతిరేకంగా తీసుకోవలసిన అత్యంత ప్రభావవంతమైన నివారణోపాయాలలో ఒకటి. ఎందుకంటే ఒక రాజుకు వ్యతిరేకంగా కుట్రకు పాల్పడే వ్యక్తి ఆ రాజుని చంపడం ద్వారా ప్రజలకు సంతోషాన్ని కలిగించాలని భావిస్తాడు. కానీ అట్టి చర్య ప్రజలకు ఆగ్రహం కలిగిస్తుందని గనుక కుట్రదారుడు భావిస్తే అటువంటి కుట్రకు పాల్పడటానికి అతనికి ధైర్యం చాలదు. ఎందుకంటే (అంతేకాక) ఒక కుట్రదారుడికి ఎదురయ్యే కష్టాలకు లెక్కేలేదు. గతానుభవాలను బట్టి చుస్తే కుట్రలు చాలా జరిగినా (కూడా, నప్పటికీ), కొన్ని మాత్రమే విజయవంతమయ్యాయి. ఎందుకంటే కుట్రకు పాల్పడేవాడు ఒంటరిగా దానిలో పాల్గొనలేడు, లేదా (అలాగే) తన సహచరుడిగా తాను అసంతృప్తిపరులుగా భావించేవారినుండి తప్ప మరెవరినీ (వేరొకరిని) స్వీకరించలేడు. నీవు అతనికి నీ ఉద్దేశాన్ని వెల్లడించినవెంటనే అతడికి తనను సంతృప్తిపరుడిగా మార్చుకొనే సరంజామాను అతనికి ఇచ్చినవాడవవుతావు. నీ కుట్రను బహిర్గతం చేయడం ద్వారా అతడు తనకు కావలసిన ప్రతీ ప్రయోజనాన్నీ పొందాలనుకుంటాడు. కనుక కుట్రకు పాల్పడటం వలన ఒక పక్క కొంతలాభం ఉన్నది, మరోపక్క ఇది సందేహాస్పదమైనది, ప్రమాదకరమైనది అవటం వలన (ఈ కుట్రలో) నీవు సహచరుడిగా విశ్వసించే వ్యక్తి నీకు అరుదైన మితృడైనా అయి ఉండాలి లేదంటే రాజుకు గర్భశత్రువైనా అయి ఉండాలి (ఓ పక్క కొంత లాభం చూచి, మరోపక్క సందేహాస్పదం, ప్రమాదం చూచిన మీదత అతడు నీకు విశ్వసనీయుడుగా ఉన్నాడు అంటే (ఉండాలీ అంటే) (ఉండటానికి) )

విషయాన్ని క్లుప్తంగా చెప్పాలీ అంటే (క్లుప్తీకరించడానికి) నేను ఇలా చెబుతాను. కుట్రదారుడి పక్షాన అతడు నిరుత్సాహపడేవిధంగా అవిశ్వాసం, అసూయ, శిక్షాభీతి, (తప్ప మరేమీ ఉండవు) ఉంటాయి. అదేసమయంలో రాజు తరపున అతడిని రక్షించడానికి చట్టాలు, ప్రభుత్వాధికారం, మిత్రుల రక్షణ, రాజ్యం (ఇవన్నీ) ఉంటాయి. వీటన్నిటికీ తోడు ప్రజలలో అతడికున్న పలుకుబడికూడా తోడైతే ఎవరికైనా అతడి మీద కుట్రచేసేంత దురుసుతనం ప్రదర్శించడం అసాధ్యం. సాధారణంగా కుట్రదారుడు దానికి పాల్పడే ముందు భయపడవలసి ఉంటుంది (తన పథకానికి కార్యరూపం ఇచ్చే ముందు) ఈ సందర్భంలో తను నేరం చేసిన తరువాత కూడ భయపడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి సందర్భంలో ప్రజలు అతడికి శత్రువులుగా వ్యవహరిస్తారు కనుక అతడు తను తప్పించుకొనే మార్గం గురించి ఆశపెట్టుకోలేడు. 

ఈ విషయం మీద అంతులేని ఉదాహరణలను పేర్కొనవచ్చును. అయితే మన తండ్రుల జ్ఞాపకాలపరిధి లోని ఒక విషయంతో నేను సరిపెట్టుకుంటాను. బొలోగ్నా రాజు మెస్సెర్ అన్నిబాలె బెంటవోగ్లి (ఇప్పటి అన్నిబాలెకు పితామహుడు) తనకు వ్యతిరేకంగా (మీద) కుట్రచేసిన క్యానెషి చేత హత్యగావింపబడినపుడు బాల్యదశలో ఉన్న మెస్సర్ గిన్నోవి తప్ప అతడి కుటుంబ సభ్యులెవరూ బ్రతికి బట్టకట్టలేదు. అతడి హత్య జరిగిన వెంటనే ప్రజలు ఉవ్వెత్తున లేచి, క్యానెషి వారందరినీ హత్యచేశేశారు (చంపేశారు). బొలోగ్నాలో ఆరోజులలో బెంటివోగ్లి కుటుంబం అనుభవిస్తున్న ప్రజాభిమానం మూలంగా ఇది సంభవించినది. ఆ అభిమానం ఎంత గొప్పదంటే అన్నిబాలే మరణం తరువాత రాజ్యాన్ని పరిపాలించగల సమర్థులెవరూ మిగలకపోయినప్పటికీ, బొలోగ్నా ప్రజలు బెంటివోగ్లి కుటుంబానికి చెందిన వారొకరు ఫ్లోరెన్స్‌లో ఉన్నారన్న విషయం తెలుసుకొని (సమాచారం తెలుసుకొని) —(అప్పటివరకూ ఒక కమ్మరి వాని కొడుకుగా భావించబడుతున్న వ్యక్తి)— అతడిని ఫ్లోరెన్స్‌నుండి (మనుషులను పంపి) రప్పించి, తమ నగర ప్రభుత్వాన్ని అతడి చేతులలో ఉంచారు. (అతడికి అప్పగించారు) అది అతడి చేత మెస్సర్స్ గియోవన్ని కి రాజ్యపాలనకు తగిన వయసు వచ్చేవరకూ పరిపాలింపబడింది.

ఈ కారణంగా ఒకరాజు తాను ప్రజాభిమానం చూరగొన్నంతకాలం (తనను ప్రజలు అభిమానిస్తున్నంతకాలం) కుట్రల గురించి పెద్దగా ఆలోచించాల్సినపనిలేదు (పెద్ద విషయాలుగా పరిగణించాల్సిన పనిలేదు) అని నేను భావిస్తున్నాను. అయితే ప్రజాభిప్రాయం అతడికి వ్యతిరేకంగా ఉండి, అతడు వారిచే ద్వేషింపబడుతున్నపుడు మాత్రం అతడు ప్రతివిషయానికి, ప్రతి ఒక్కరికి భయపడవలసి ఉంటుంది. సక్రమమైన (అంతా సజావుగా ఉన్న) రాజ్యాలు, వివేకవంతులైన రాజులు —ప్రభువర్గీయులు నిస్పృహతో తెగించే పరిస్థితికి వారిని నెట్టకుండా, అలాగే ప్రజలు సంతుష్టులుగా, సంతోషంగా ఉండాటానికి కావలసిన— ఆన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎందుకంటే ఒక రాజుకు ఉండవలసిన అతి ముఖ్యమైన లక్ష్యాలలో ఇది ఒకటి.

మనకాలంలో సక్రమంగా వ్యవస్థీకరింపబడి సజావుగా పరిపాలింపబడుతున్న సామ్రాజ్యాలలో ఫ్రాన్సు ఒకటి. దానిలో రాజు యొక్క స్వేచ్ఛ, రక్షణ ఆధారపడి ఉన్న అనేక మంచి వ్యవస్థలను మనం చూడవచ్చు. వీటిలో మొదటిది పార్లమెంటు మరియు దాని అధికారం. ఎందుకంటే ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ప్రభువర్గీయుల ఆకాంక్ష, అలాగే వారికుండే ధైర్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని కట్టడి చేయడానికి వారికి (ముకుతాడు) నోటికి పగ్గం అవసరం అనీ అనుకున్నాడు; అలాగే మరోపక్క ప్రభువర్గీయులమీద –భయం మూలంగా– ప్రజలకుండే prajalaku praBuvargeeyulameeda BayaM mUlaMgaa uMDE ద్వేషాన్ని దృష్టిలో ఉంచుకొని (ప్రజలకు భయం వలన తలయెత్తే) వారిని రక్షించాలనీ అనుకున్నాడు. అయినప్పటికీ ఇదంతా రాజు యొక్క బాధ్యత (రాజు తీసుకోవలసిన జాగ్రత్త) గా అవడానికి అతడు ఆతురత చెందలేదు. ఆ విధంగా ప్రజలకు అనుకూలంగా వ్యవహరించడం వలన ప్రభువర్గీయులు నిందించకుండా, ప్రభువర్గీయులకు అనుకూలంగా వ్యవహరించడం వలన ప్రజలు నిందించకుండా (ప్రభువర్గీయుల నింద, ప్రజల నింద) (రాజుకు లేకుండా చేసి) చేసి (మోయకుండా చేసి) (అసమ్మతి కలుగకుండా) ప్రభువర్గీయులకు అడ్డుకట్టవేసి, ప్రజలకు మేలుచేసే (రాజుకు ఏ విధమైన నింద రాకుండా) ఒక మూడవ సంస్థను నెలకొల్పాడు (పార్లమెంటు). ఇంతకన్నా మంచి వివేకవంతమైన ఏర్పాటుగానీ లేక రాజుకు, రాజ్యానికీ ఇంతకనన్న గొప్ప రక్షణ వనరుగానీ నీకు లభించదు. దీనినుండి ఏవరైనా మరో ముఖ్యమైన సూత్రీకరణను రాబట్టవచ్చును. అదేమంటే రాజులు నిందను మోయవలసిన (అసమ్మతిని తెచ్చిపెట్టే) వ్యవహారాలను నిర్వర్తించడాన్ని ఇతరులకు వదిలివేయాలి. అభిమానాన్ని తెచ్చిపెట్టే వ్యవహారాలను తమచేతులలో ఉంచుకోవాలి. (మరలా నేనేం చెబుతానంటే) చివరికి నేనేమనుకుంటున్నానంటే ఒక రాజు ప్రభువర్గీయులను సంతోషపెట్టాలిగానీ అది తాను ప్రజల ద్వేషానికి గురి అయ్యెంతగా ఉండకూడదు.

రోమన్ చక్రవర్తుల జీవితాలను, వారి మరణాలను పరిశీలించిన వారిలో కొందరికి బహుశా ఆ చక్రవర్తులలో పెక్కుమంది నా ఉద్దేశానికి విరుద్ధమైన ఉదాహరణలుగా ఉండటం బహుశా (ఒకవేళ) గోచరించవచ్చును. (ఆ చక్రవర్తులలో) వారిలో కొందరు ఎంతో ఉన్నతంగా, గొప్ప ఆత్మ సౌందర్యంతో జీవింఛారు. అయినప్పటికీ వారు తమ సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్నారు లేదంటే తమకు వ్యతిరేకంగా కుట్రచేసిన అనుచరుల చే చంపబడ్డారు. కనుక ఇటువంటి అభ్యంతరాలకు సమాధానం ఈయవలెనని కోరుకుంటూ కొందరు చక్రవర్తుల గుణగణాలను చర్చించి (గుర్తుచేసుకుని) (పరీక్షించి) వారి వినాశనానికి కారణాలు నేను చెప్పినదానికన్నా విరుద్ధంగా లేవని చూపుతాను. అదే సమయంలో ఆనాటి వ్యవహారాలను అధ్యయనం చేసేవారికి ముఖ్యంగా అనిపించే విషయాలను మాత్రమే నేను పరిశీలన కొరకు స్వీకరిస్తాను (ముందుకు తెస్తాను) (మీ ముందుంచుతాను)

తత్త్వవేత్త మార్కస్ నుండి మాగ్జిమినస్ వరకు సామ్రాజ్యానికి చక్రవర్తులుగా వచ్చిన వారందరినీ తీసుకుంటే సరిపోతుందని నాకనిపిస్తున్నది (చాలని నేను భావిస్తున్నాను) వారు వరుసగా మార్కస్, అతని కొడుకు కొమ్మొడస్, పెర్టినాక్స్, జులియన్, సెవెరస్, అతని కొడుకు ఆంటోనినస్ కారకల్ల, మాక్రినస్, హెలియోగాబలస్, అలెగ్జాండర్, మాగ్జిమినస్.

ముందుగా గమనించవలసిన విషయమేమిటంఅటే ఇతర రాజ్యాలలో ప్రభువర్గీయుల ఆకాంక్షలు, ప్రజల అవిధేయతతోమాత్రమే పోరాడవలసి ఉండగా రోమన్ చక్రవర్తులు సైనికుల క్రూరత్వం, దురాశ అనే మూడవ కష్టంతో కూడా సతమతమయ్యేవారు. (ఈ విషయం వలన ఎంతగా కష్టాలు చుట్టుముట్టేవంటే) ఈ విషయం ఎంతగా కష్టాలతో చుట్టుముడుతుందంటే ఇది అనేక మందికి వినాశనంగా నిలిచింది.

సైన్యం, ప్రజలు ఇరువురినీ తృప్తిపరచడం కష్టమీన పని కనుక. ఎందుకంటే ప్రజలు శాంతిని ప్రేమిస్తారు కనుక వారు శాంతికాముకుడైన రాజును ఇష్టపడతారు. అయితే సైనికులు దురుసుతనం, క్రూరత్వం, దోపిడీ మొదలైన లక్షణాలుకలిగి యుద్ధప్రియుడైన రాజును ఇష్టపడతారు. తమకు రెట్టింపు భత్యం లభించేటట్లుగా (తాము రెట్టింపు భత్యం పొందేటట్లుగా) అలాగే తమ (లోని) క్రూరత్వాన్ని, దురాశను ప్రదర్శించే అవకాశం దొరికేటట్లుగా రాజు ఆ లక్షణాలన్నింటినీ ప్రజలమీద ప్రయోగించాలని (ప్రదర్శించాలని చూపించాలని) వారు కోరుకుంటారు.

దీనివలన ఏటువంటి పరిణామం తలయెత్తినదంటే వారసత్వంద్వారాగానీ, శక్తిసామర్థ్యాలద్వరా గానీ ప్రజలు, సైన్యం ఇరువురినీ కట్టడిచేయగలిగేంతటి అధికారంకలిగిలేని చక్రవర్తులు ఎల్లప్పుడూ వినాశనాన్నే పొందారు, వీరిలో ఎక్కువమంది ముఖ్యంగా సామ్రాజ్యానికి కొత్తగా వచ్చి, అనుభవం లేకుండా ఉన్నవారు ఈ వైరి (విభిన్న, సంఘర్షించే, వ్యతిరేక ) కూటములతో (వర్గాలతో) వ్యవహరించడం లో ఉన్న కష్టాన్ని గుర్తించి  సైనికులను సంతృప్తిపరచడం వైపుమొగ్గి ప్రజలకు ఆగ్రహాన్ని కలుగజేయడాన్ని చిన్నవిషయంగా పరిగణించారు. ఈ విధంగా వ్యవహరించడం వారికి తప్పనిసరి. ఎందుకంటే రాజులు ఎవరో ఒకరిచేత ద్వేషింపబడటాన్నుండి తప్పించుకోలేనపుడు (ద్వేషానికి గురవటం తప్పనపుడు) వారు మొట్టమొదట అధిక సంఖ్యాకకుల ద్వేషానికి గురికాకుండా ప్రయత్నించాలి (జాగ్రత్తపడాలి), ఒకవేళ అలాచేయలేని పక్షంలో అధికశక్తివంతుల ద్వేషానికి గురికాకుండా ఉండటానికి వారి చేయగలిగినదంతా చేయాలి.

కనుక ఆ చక్రవర్తులు తాము కొత్తవారైనందువలన (ప్రజల మద్దతు కన్నా కూడా సైన్యం యొక్క విశేషమైన మద్దతు యొక్క ఆవశ్యకతలో ఉంటారు) తమకు కావలసిన విసేషమైన మద్దతు కొరకు వారు ప్రజలకన్నా సైన్యాన్ని అంటిపెట్టుకొని ఉండటానికే (కొత్తవారైన కారణంగా విశేషమైన మద్దతు యొక్క ఆవశ్యకతలో ఉండి దాని కొరకు వారు ప్రజల మీద కన్నా) ఆసక్తి చూపుతారు. ఈ చర్య వారికి లాభదాయకంగా ఉంటుందా లేదా అన్నది వారు సైన్యం మీద తమ పట్టును కలిగి ఉంటారా లేదా అన్నదానిమీద ఆధారపడి ఉంటుంది. (పట్టు కలిగి ఉండేదాన్ని బట్టి ఉంటుంది)

ఈ కారణాలవలన –మార్కస్, పెర్టినాక్స్, అలెగ్జాండర్– వీరంతా ౠజుమార్గంలో జీవించేవారు, న్యాయాన్ని ప్రేమించేవారు, క్రూరత్వానికి శత్రువులు, మానవత్వం, దయ కలిగినవారు అయి ఉండి –ఒక్క మార్కస్ తప్ప– విషాదకరమైన అంతాన్ని చవిచూడటం అనే పరిణామం జరిగినది. (ఈ కారణాలవలన ఎటువంటి పరిణామం జరిగినదంటే –విషాదాంతాన్ని చవిచూచారు) మార్కస్ ఒక్కడే గౌరవంగా జీవించి అలానే మరణించాడు. ఎందుకంటే అతనికి సింహాసనం వారసత్వ హక్కుగా సంక్రమించినది కనుక దాని కొరకు అతడు సైన్యానికి గానీ, ప్రజలకు గానీ ఏ మాత్రం ఋణపడిలేడు. అంతేగాక తనను గౌరవపాత్రుడిగా చేసిన అనేక సుగుణాలను అతను కలిగి ఉండి (ఉండటం వలన కూడా) ఇరువర్గాలనూ అతడు తను జీవిత పర్యంతం కట్టడి చేయగలిగాడు. ఈ క్రమంలో అతడు ద్వేషానికి  గానీ తిరస్కారానికి గానీ గురికాలేదు. (–ద్వేషానికి తిరస్కారానికి గురికాకుండ– ఎల్లప్పుడూ కట్టడి చేశాడు.)

ఐతే పెర్టినాక్స్ సైనికుల ఆకాంక్షలకు విరుద్ధంగా చక్రవర్తిగావింపబడ్డాడు. ఆ సైనికులు కమొడస్ హయాంలో విచ్చలవిడి జీవితానికి అలవాటుపడి ఉండటం వలన పెర్టినాక్స్ విధించిన క్రమశిక్షణాయుత జీవితాన్ని వారు సహించలేకపోయారు. ఈ విధంగా జనించినద్వేషానికి, అతడి వృద్ధాప్యం మూలంగా కలిగిన తిరస్కారం కూడా తోడవడంతో అతడి పరిపాలన ప్రారంభంలోనే అతడు కూలదోయబడ్డాడు. (పరిపాలన ప్రారంభమైన కొద్దికాలానికే అతడు అధికారంనుండి కూలదోయబడ్డాడు) (తొలిదశలో ఉన్నపుడే) (దీనిని బట్టి) ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తించాలి. చెడ్డపనులవలన మనం ఎంతగా ద్వేషానికి గురీవుతామో అంతగా మంచిపనుల వలన కూడా గురీవుతాము. కనుక, నేను ఇంతకు ముందు చెప్పిన ప్రకారంగా, తన రాజ్యాన్ని నిలుపుకోవాలని కోరుకునే రాజు చాలా తరచుగా చెడు చేసేవిధంగా వత్తిడి చేయబడతాడు. నీస్థానాన్ని నిలుపుకోవడానికి అవసరం అని నీవు భావించే వర్గం–అది ప్రజలు లేక సైనికులు లేదా ప్రభువర్గం ఎవరైనా కావచ్చు– అవినీతిమయమైనపుడు దాని స్వభావాన్ని నీవు మన్నించాలి, దానిని తృప్తిపరచాలి. ఇటువంటి సందర్భంలో మంచిపనులు నీకు హాని చేస్తాయి.  

ఐతే ఇక అలెగ్జాండర్ విషయానికి వస్తే, అతనిలో మంచితనం ఎంతగా ఉన్నదంటే అతడు ఇతర ప్రశంశనార్హతలను కలిగి ఉండటంతో పాటుగా ()ఇతర విషయాలలో ప్రశంశనీయుడవటమేకాక) అతడు సామ్రాజ్యాన్ని పరిపాలించిన పదునాలుగు సంవత్సరాలలో ఎప్పుడూ న్యాయవిచారణలేకుండా ఏ ఒక్కరూ కూడా మరణదండనకు గురికాలేదు (అతనిచే) అయినప్పటికీ అతడు పురుషోచిత లక్షణాలులేనివాడిగా (భోగలాలసుడిగా), తన తల్లి చెప్పుచేతల్లో నడచుకొనే వ్యక్తిగా భావింపబడటం వలన తిరస్కారానికి (అవిధేయతకు, అగౌరవానికి) భావింపబడి, తద్వారా తిరస్కారాన్ని పొందడంతో సైన్యం అతనికి వ్యతిరేకంగా కుట్రచేసి అతడిని హత్యచేసేసింది. 

ఇప్పుడి (పైన పేర్కొన్న వ్యక్తులకు) విరుద్ధనైన వ్యక్తులైన (మరోపక్క) కొమొడస్, సెవెరస్, ఆంటోనిసస్ కారకల్ల, మాగ్జిమినస్ మొదలైనవారి (లక్షణాలను చూస్తే) (పరిసీలిస్తే) వారంతా క్రూరులు, దోపిడీదారులు అని నీవు తెలుసుకుంటావు. వారు తమ సైనికులను తృప్తిపరచడానికి ప్రజలమీద ఏ మాత్రం సంకోచం లేకుండా ఆన్ని రకాల దుశ్చర్యలకూ పాల్పడ్డారు. వీరిలో సెవెరస్ తప్ప అందరూ విషాదకరమైన ముగింపు పొందారు. అయితే సెవెరస్‌లో ఎంతటి శక్తిసామర్థ్యాలు ఉన్నాయంటే, అతడి చేత ప్రజలు అణచివేయబడినప్పటికీ సైనికులతో స్నేహంగా మెలగుతూ అతడు విజయవంతంగా పరిపాలన కొనసాగించాడు. ఎందుకంటే అతడి శౌర్యపరాక్రమాలు సైనికులదృష్టిలో, ప్రజలదృష్టిలో అతడిని ఎంత ఆరాధనీయుడిని చేశాయంటే (ఆరాధనీయమైనవ్యక్తిని, ఆరాధ్యుడు) ప్రజలు అతని యెడల ఆశ్చర్యంతో, భయభీతులతో ఉండేవారు, సైనికులు గౌరవభావంతో, సంతృప్తితో ఉండేవారు. మరి ఒక కొత్తరాజు (New Prince) గా ఈ మనిషి యొక్క చర్యలు గొప్పవి అవడంవలన నక్కను, సింహాన్ని అనుకరించడం – నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒకరాజుకు వీటి స్వభావాలను అనుకరించడం ఆవశ్యకం– ఎలానో అతడికి బాగా తెలుసునని సంక్షిప్తంగా చూపాలనుకుంటున్నాను.

చక్రవర్తి జూలియన్ యొక్క సోమరితనం గురించి తెలుసుకున్న సెవెరస్, తను నాయకత్వం వహించే స్లవోనియాలోని సైన్యానికి ‘చక్రవర్తి అంగరక్షకులచే చంపబడిన పెర్టినాక్స్ మరణానికి ప్రతీకారం (కొరకు, చేయడానికి) తీర్చుకోవడానికి రోమ్‌కు బయలుదేరడం సబబుగా ఉంటుంద’ని ఉద్భోదించాడు (చెప్పి వారిని అంగీకరింపజేశాడు(సమ్మతింపచేశాడు)) ఈ వంకతో, తాను సింహసనాన్ని ఆశిస్తున్న విషయాన్ని బయటకు తెలియనీయకుండా, తన సైన్యంతో రోమ్ దిశగా పురోగమించి తాను బయలుదేరిన విషయం తెలిసిపోకముందే ఇటలీ చేరుకున్నాడు. రోమ్‌కు అతని రాకతో (అతని రోమ్ రాకతో) భయపడిపోయిన సెనేట్ అతడిని చక్రవర్తిగా ఎన్నుకొని జూలియన్ ను చంపివేసింది.  ఈ విధంగా తొలిఅడుగువేసిన తరువత సెవెరస్‌కు సామ్రాజ్యంమీద సంపూర్ణ ఆధిపత్యం పొందడానికి (పూర్తి నియంత్రణ సాధించడానికి) ఇంకా రెండు ఆటంకాలు మిగిలి ఉన్నాయి (రెండు కష్టాలను ఎదుర్కోవలసి ఉన్నది) : ఒకటి: ఆసియా సైన్యాలకు నాయకుడైన నిగ్రినస్ (నైగెర్) తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకున్న ఆసియాలో, మరొకటి అల్బినస్ ఉన్న పశ్చిమప్రాంతంలో –ఇతను కూడా సింహాసనాన్ని ఆశిస్తున్నాడు. ఇరువురినీ ఎదుర్కోవడం (ఇరువురితోనూ శతృత్వం వహించడం) ప్రమాదమని తలచిన సెవెరస్ నిగ్రినస్‌ను ఎదుర్కొని, అల్బినస్‌ను మోసగించాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రకారంగా ఆల్బినస్‌కు అతడు ఇలా జాబు రాశాడు. 'సెనేట్ ద్వారా చక్రవర్తిగా ఎన్నికైన తాను ఆ హోదాను తనతో పంచుకోవాలనుకుంటున్నాననీ కనుకనే తనకి సీజర్ బిరుదాన్ని పంపాననీ, పైగా సెనేట్ అతడిని తన సహచరునిగా (నిర్ణయిస్తూ) తీర్మానించినదనీ రాశాడు'. ఈ విషయాలన్నింటినీ అల్బినస్ నిజమని (నిజాలుగా) భావించాడు. అయితే సెవెరస్ నైగెర్‌ను జయించి అతడిని మట్టుబెట్టి, ఆసియా వ్యవహారలను చక్కదిద్దినన (చక్కబెట్టిన) తరువాత అతడు రోమ్‌కు తిరిగి వచ్చి –'అల్బినస్ తననుండి పొందిన ప్రయోజనాలను కొంచెమైన గుర్తించకుండా కుట్రద్వారా తనను హత్యగావించాలని కోరుకున్నాడనీ (కోరుకుంటున్నాడనీ), ఈ విధమైన కృతఘ్నత వలన అతడిని శిక్షించడం తనకు తప్పనిసరి అవుతున్నదనీ– సెనేట్‌కు ఫిర్యాదు చేశాడు. తదుపరి అతడిని ఫ్రాన్స్ (గాల్)లో వెతికి పట్టుకొని (ఫ్రాన్స్ వెళ్ళీ అతడిని వెతికి పట్టుకొని) అతడినుండి రాజ్యాన్ని, ప్రాణాన్ని రెంటినీ లాగేసుకున్నాడు. (రాజ్యంతో పాటు అతడి ప్రాణాలనుకూడా) దీనిని బట్టి సెవెరస్ యొక్క చేతలను జాగ్రత్తగా పరీక్షించిన వారెవరైనా కూడా అతడిని ఒక క్రూరాతిక్రూరమైన సింహంగా మరియు అమిత జిత్తులమారిదైన నక్కగా తెలుసుకుంటారు. (అతడిలో సింహం యొక్క క్రూరత్వం మరియు నక్క యొక్క జిత్తులమారితనాన్ని కనుగొంటారు దర్శిస్తారు) అలాగే ప్రతి ఒకరూ అతడిని చూచి భయపడుతున్నట్లు, అతడిని గౌరవిస్తున్నట్లు, అతడు సైన్యం యొక్క ద్వేషానికి గురికాకుండా ఉన్నట్లు (కూడా) తెలుసుకుంటారు (అతడు సైన్యం యొక్క ద్వేషానికి గురికాలేదనీ, ప్రతి ఒకరూ అతడికి భయపడుతున్నారనీ..........) అంతేకాక ఒక కొత్తవ్యక్తి అయిఉండి కూడా అతడు సామ్రాజ్యాన్ని అంతబాగా నిలుపుకోవటం చూచి ఆశ్చర్యపోరు. ఎందుకంటే అతడి క్రూరత్వం మూలంగా ప్రజలలో అతడి యెడల dvEhaM gUDukaTTukOkuMDA గూడుకట్టుకొనే (కట్టుకోవడానికి) అవకాశం ఉన్న ద్వేషబారినుండి గొప్పదైన అతడి ప్రఖ్యాతి అతడిని ఎల్లవేళలా రక్షించింనది కనుక. (ద్వేషం గూడు కట్టుకొనే అవకాశం ఉన్నాకూడా గొప్పదైన అతడి ప్రఖ్యాతి దానినుండి (ఆ ద్వేషం నుండి) అతడిని ఎల్లవేళలా)

అతని కొడుకు ఆంటోనినస్ (Antoninus Caracalla) కూడా గొప్ప శక్తిసామర్థ్యాలు కలిగిన మనిషి. అతడిని ప్రజల దృష్టిలో ఆరాధ్యుడిని, సైనికులకు ఆమోదయోగ్యుడిని చేసిన ఉత్తమమైన గుణగణాలను అతడు కలిగిఉన్నాడు. అతడు యుద్ధ ప్రియుడు, ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోగలిగే సమర్థత ఉన్నవాడు, పసందైన ఆహారం యెడల, ఇతర భోగాల యెడల విముఖత కలిగినవాడు అవటం వలన సైన్యం మొత్తానికీ ప్రేమపాత్రుడు (అయ్యాడు) కాగలిగాడు. అయినప్పటికీ ఇతని ఆటవికత, ఇతని క్రూరత్వం ఎంతటి దారుణమైనవి, ఎంతటి (గా) కనీవినీ ఎరుగనటువంటివీ అంటే అనేకమంది పౌరులను (వివిధసందర్భాలలో, ఒక్కొక్కపౌరుడినీ) అంతులేకుండా హత్యచేయడం ద్వారా ఇతడు రోమ్ ప్రజలలో అధికభాగం మరియు అలెగ్జాండ్రియా ప్రజలందరి యొక్క చావుకి కారకుడిగా నిలిచాడు. మొత్తం ప్రపంచం ఇతడిని ద్వేషించనారంభించడంతోపాటు అతడి చుట్టు ఉన్నవారు కూడా అతడిని చూచి భయపడటం జరిగి, చివరికి ఒక చిన్న సైనికపటాలపు నాయకునిచేత (Centurion) తన సైన్యం నడిమధ్యనే హత్యగావింపబడ్డాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పకడ్బందీ (యోచనతో) ప్రణాళిక (పథకం) తో, తెగింపుతోకూడిన ధైర్యంతో, స్థిర (చిత్తంతో) నిర్ణయంతో జరిగే (జరుపబడే) ఇటువంటి హత్యలనుండి రాజులు తప్పించుకోలేరు. ఎందుకంటే చావుకి భయపడని వారు ఎవరైనా వీటిని (అమలు) చేయగలరు. అయితే అటువంటివి చాలా అరుదు కనుక వాటి గురించి రాజు అంతగా భయపడనవసరం లేదు. తన చుట్టూ ఉండేవారిగా (తనకు సమీపంగా మసలుకునేవారిగా) ప్రభుత్వ సేవలో తాను నియోగించే వారెవరికీ ఎటువంటి తీవ్రగాయం తాను చేయకుండా మాత్రమే అతడు జాగ్రత్తవహించాలి. ఆంటోనినస్ ఇటువంటి జాగ్రత్త తీసుకోక ఆ సైనిక పటాలపు నాయకుడి (యొక్క ఒకానొక) సోదరుడిని అవమానకరంగా చంపటమేకాక, అతడిని కూడ ప్రతిరోజూ బెదిరిస్తూ, మరలా అతడినే తన అంగరక్షకుడిగా ఉండనిచ్చాడు. ఇది ఎంతటి నిర్లక్ష్యపూరితమనిన చర్యో ఆ చక్రవర్తి వినాశనం ద్వారా నిరూపితమయ్యింది. (ఇది ఒక నిర్లక్షపూరితమైన మరియు ప్రమాదకరమైన (ప్రాణాంతకమైన) చర్య అని జరిగినదాన్ని బట్టి తేటతెల్లమవుతున్నది)

ఇక మనం కొమొడస్ విషయానికి వస్తే, మార్కస్ కొడుకుగా అతడు సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందాడు కనుక దానిని నిలుపుకోవడం అతనికి చాలా సులువు (అయి ఉండేది). ప్రజలను, సైనికులను తృప్తిపరచడనికి అతను కేవలం తన తండ్రి అడుగుజాడలను అనుసరిస్తే సరిపోయి ఉండేది. అయితే అతడు క్రూర మరియు ఆటవిక స్వబావం కలిగినవాడవడం చేత (కలిగినవాడై) ప్రజలను దోచుకోవడానికి వీలుగా సైనికులకు వినోదాన్ని అందిస్తూ వారిలో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించేవాడు. మరోపక్క తన హుందాతనాన్ని పక్కనబెట్టి గ్లాడియేటర్‌లతో పోరాడటానికి తరచుగా బరిలోకి దిగేవాడు. ఇంకా తన సార్వభౌమ గౌరవానికి తగనటువంటి అనేక ఇతర అసహ్యకరమైన పనులు చేస్తూ సైనికుల దృష్టిలో చులకనైపోయాడు. ఈ విధంగా ఓ పక్క ద్వేషానికీ, మరోపక్క తిరస్కారానికీ (చులకనకూ, అసహ్యానికీ) లోనైన ఇతడు చివరకు కుట్రకు గురై చంపివేయబడ్డాడు.

మాగ్జిమినస్ యొక్క గుణదోషాలను (వ్యక్తిత్వాన్ని) చర్చించడం మిగిలిపోయింది. ఇతను మంచి యుద్ధప్రియుడు. అలెగ్జాండర్ –ఇతని గురించి నేను ఇప్పటికే చెప్పివేశాను– యొక్క భోగలాలసత గిట్టని సైన్యం అతడిని చంపివేసి మాగ్జిమినస్‌ను సింహాసనానికి (చక్రవర్తిగా) ఎంపిక చేసినది. (ఎన్నుకున్నది) రెండు కారణాల (విషయాల) మూలంగా అతడు ద్వేషానికీ, చులకనకూ (తిరస్కారానికీ) గురవటంవలన అతడు దానిని ఎక్కువకాలం నిలుపుకోలేదు (నిలుపుకోలేకపోయాడు). ఒకటి : అతడి హీనమైన ఆరంభం (పుట్టుక, గతం, మూలాలు, గతచరిత్ర). థ్రేస్‌లో ఒకప్పుడు అతడు గొర్రెలు కాసేవాడు అనేది అందరికీ తెలిసినవిషయమే. దీనిమూలంగా ప్రతిఒకరూ అతడిని తిరస్కారంతో చూచేవారు (అతని యెడల తిరస్కారభావాన్ని కలిగిఉండేవారు) రెండవ కారణం: ఇతడు చక్రవర్తిగా ఎన్నుకోబడగానే (ప్రకటింపభడగానే) సింహాసనాన్ని స్వీకరించడానికి రోమ్‌కు వెళ్ళడంలో చేసిన ఆలస్యం. (తన పరిపాలన యొక్క ప్రారంభంలో సింహాసనాన్ని స్వీకరించడానికి రోమ్‌కు వెళ్ళడంలో చేసిన జాప్యం) రోమ్‌లోనూ, మరియూ సామ్రాజ్యంలోని మిగిలిన ప్రాంతాలలోనూ (మిగతా చోట్లా) తన అధికారులద్వారా అనేక క్రూరమైన చర్యలకు పాల్పడటం ద్వారా ఇతడు అత్యంత క్రూరుడిగా కూడా పేరుమోసాడు. దీనిమూలంగా మొత్తం ప్రపంచం అతడి హీనమైన పుట్టుక యెడల (తిరస్కారపూరితమైన) కోపంతోనూ (క్రోధంతోనూ), అతడి క్రూరత్వం యెడల భయం (వలన (మూలంగా) కలిగిన ద్వేషం) తోనూ కదిలిపోయింది. (అతడికి వ్యతిరేకంగా సంఘటితమనది) ముందుగా ఆఫ్రికా (తిరగబడింది), తరువాత సెనేట్, రోమ్‌ప్రజలందరూ, చివరికి మొత్తం ఇటలీ (దీనిని అనుసరించారు) అతడికి వ్యతిరేకంగా (సంఘటితమయ్యారు) కుట్రచేశారు. అతడి స్వంత సైన్యం కూడా వారితో కలిసినది. (ఎలాగంటే) ఆక్విలియా ముట్టడిలో ఉన్న అతడి సైన్యం దానిని స్వాధీనం చేసుకోవడంలో అనేక కష్టాలకు లోనై, అతడి క్రూరమైన చర్యల యెడల కోపోద్రిక్తమై (ను అసహ్యించుకొని) –అతడికి వ్యతిరేకంగా అనేక మంది నిలవటం గమనించిన మీదట అతడంటే భయం తగ్గి (క్షీణించి) – అతడిని చంపివేసింది.

పూర్తిగా తిరస్కారానికి లోనై వేగంగా తుడిచిపెట్టుకుపోయిన (త్వరితగతిన వినాశనాన్ని పొందిన, వేగంగా అంతమైంపోయిన, పతనమైపోయిన) హెలియోగాబలస్, మాక్రినస్ లేక జూలియన్ గురించి చర్చించాలని నేను అనుకోవడంలేదు. మనకాలంలోని రాజులకు తమ సైనికులను పెద్దయెత్తున సంతృప్తిపరచడం అనే ఇబ్బంది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది అని చెప్పడం ద్వారా ఈ చర్చను నేను ఒక ముగింపుకు తెస్తాను. రోమన్ సామ్రాజ్యపు సైన్యాలవలే నేటికాలంలోని రాజులు స్థిరసైన్యాలను కలిగిఉండరు కనుక —ప్రభుత్వ నిర్వహణలోనూ, వివిధప్రాంతాల పరిపాలనలో అవి దీర్ఘానుభవం కలిగినవిగా మారేవిధంగా—ఆ సైన్యాలను కొద్దోగొప్పో సంతృప్తిపరచవలసిన అవసరం ఉన్నప్పటికీ అది వెంటనే తీరిపోతుంది (ఎందుకంటే రోమన్ సామ్రాజ్యపు సైన్యాలవలే..............) (ప్రభుత్వ నిర్వహణతోనూ, వివిధప్రాంతాల పరిపాలనతోనూ అవిభాజ్యమైన సంబంధం కలిగిన సైన్యాలు కలిగి ఉండరు కనుక) నాటికాలంలో ప్రజలకన్నా సైనికులు ఎక్కువ శక్తికలిగినవారు కనుక అప్పుడు ప్రజలను కాకుండా సైనికులను సంతృప్తిపరచవలసిన అవసరం ఎక్కువగా ఉండేదైతే, ఇప్పుడు సైనికులకన్నా ప్రజలు ఎక్కువశక్తి కలిగినవారు కనుక టర్క్ (టర్కీ రాజు), సొల్డాన్ (ఈజిప్ట్ సుల్తాన్) లను మినహాయించి మిగిలిన రాజులందరికీ సైనికులను కాకుండా (కన్నా) ప్రజలను సంతృప్తిపరచవలసిన అవసరం ఎక్కువగా ఉన్నది.

నేను టర్క్‌ను ఎందుకు మినహాయించానంటే అతడు ఎల్లప్పుడూ తన చుట్టూ (వెన్నంటే) పన్నెండువేలమంది పదాతిదళాన్ని, పదిహేనువేలమంది అశ్వికదళాన్ని (వెన్నంటే) ఉంచుకుంటాడు. ఈ బలగాలమీదే అతడి సామ్రాజ్యం యొక్క రక్షణ, బలం ఆధారపడి ఉంటాయి కనుక ప్రజల గురించి శ్రద్ధ తీసుకోవడాన్ని పక్కనబెడుతూ –వారితో స్నేహంగా మెలగడం అతడికి అవసరం. (ప్రజలమీద శ్రద్ధను పక్కన) సోల్డాన్ సామ్రాజ్యం కూడా అచ్చం ఇలానే ఉంటుంది. సామ్రాజ్యం మొత్తం సైనికుల చేతుల్లోనే ఉండటంతో ఇతడికి కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా (శ్రద్ధ లేకుండా) వారితో స్నేహంగా మెలగవలసి ఉంటుంది. ఇక్కడ నీవొక విషయాన్ని గమనించాలి. సొల్డాన్ రాజ్యం మిగతా అన్ని రాజ్యాల వలేనుండక క్రైస్తవ పోపు రాజ్యాన్ని (క్రైస్తవ పోప్ అధికారాన్ని) (పోప్ పదవి) పోలి ఉన్న కారణంగా (అనువంశిక (వారసత్వ) రాజ్యం అని గానీ, నూతన రాజ్యం అనిగానీ పిలువలేని క్రైస్తవ పోపు రాజ్యాన్ని (క్రైస్తవ పోప్ అధికారాన్ని (పోప్ పదవి) ) పోలి ఉంటుంది ) దీనిలో చనిపోయిన రాజు వారసత్వాన్ని అతని కొడుకులు పొందకుండా —ఎన్నుకునే అధికారం (తథధికారం) ఉన్న వారు ఆ స్థానానికి ఎవరిని ఎన్నుకుంటారో— ఆవ్యక్తి పొందుతాడు. అతడి కొడుకులు కేవలం ప్రభువర్గీయులుగానే మిగిలిపోతారు. ఇది ఒక పురాతన ఆచారం అవడంతో పాటు ఆ రాజ్యంలో నూతన రాజ్యాలలో ఎదురయ్యే కష్టాలేవీ కూడా ఉండవు కనుక అది ఒక నూతన రాజ్యంగా పిలువబడదు. అంతేగాక రాజు కొత్తవడైనప్పటికీ రాజ్యంలోని వ్యవస్థలు పాతవే అయి ఉండి అతడిని వారసత్వ రాజుగానే (వారసత్వ ప్రభువు అన్నట్లుగానే) స్వీకరించే విధంగా ఏర్పడి (నిర్మితమై) ఉంటాయి.

ఇక మనం చర్చిస్తున్న విషయానికి వస్తే పై వాదనను అధ్యయనం చేసిన వారెవరైనా (దీని గురించి యోచించినవారెవరైఅనా) ద్వేషంగానీ, తిరస్కారంగానీ (అగౌరవంగానీ, చులకనగానీ) పైన పేర్కొన్న చక్రవర్తుల వినాశనానికి కారణాలుగా చూస్తారు. (గమనిస్తారు, గుర్తిస్తారు) కొంతమంది ఒక మార్గాన్ని అనుసరిస్తూ, మరికొంతమంది మరో మార్గాన్ని అనుసరిస్తూ (వ్యవహరించి) ప్రతి మార్గంలోనూ (ఒక్కొక మార్గంలో) కేవలం ఒక్కరే సంతోషకరమైన ముగింపును చేరుకొని మిగతావారు విషాదకరమైన ముగింపును (అంతాన్ని) చేరుకోవడం ఎలా జరిగినదో కూడా గుర్తించగలరు (చడం జరుగుతుంది) (గుర్తిస్తారు, గమనిస్తారు) పెర్టినాక్స్, అలెగ్జాండర్లు ఇరువురూ కూడా కొత్తపరిపాలకులు కనుక అనువంశిక రాజైన (వారసత్వంగా రాజైన) మార్కస్ను అనుకరించడం వారికి నిరుపయోగం మరియు ప్రమాదకరం. అదెవిధంగా కారకల్లా, కొమొడస్ మరియు మాగ్జిమినస్లు సెవెరస్ను అనుకరించడం పూర్తిగా వినాశకరం. ఎందుకంటే అతని అడుగుజాడలలో నడవడానికి చాలినంతటి పరాక్రమం వారికి లేదు. కనుక తన రాజ్యాన్ని కొత్తగా పొందిన రాజు మార్కస్ చేతలను అనుకరించలేడు. అలాగే సెవెరస్ చేతలను అనుకరించవలసిన అవసరం కూడా లేదు. అయితే తన రాజ్యాన్ని స్థాపించడానికి అవసరమైన నైపుణ్యాలను సెవెరస్నుండి తప్పక స్వీకరించాలి, అలాగే అప్పటికే స్థాపించబడి, స్థిరత్వాన్ని సాధించిన రాజ్యాన్ని నిలుపుకోవడానికి తగినవి మరియు దానికి వైభవాన్ని ఆపాదించేవి అయినటువంటి నైపుణ్యాలను మార్కస్ నుండి స్వీకరించాలి. 

    





   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి